ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాహనాల అమ్మకాలు జరిగిన తీరు పరిశీలిస్తే.. 2019-20లో 4లక్షల 99వేల 731 వాహన విక్రయాలు జరిగితే.. 2020-21లో 3లక్షల 54వేల 529 వాహనాలు మాత్రమే విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే సుమారు లక్షా 45వేల 202 వాహనాల అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో వాహన విక్రయాల ద్వారా రవాణా శాఖకు రూ.1,645.90కోట్లు సమకూరగా.. 2020-21లో రూ.1,159.97కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే రూ.485.93 కోట్ల ఆదాయం తగ్గినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్ మాసంతో పోల్చితే..ఈ ఏడాది సెప్టెంబర్లో వాహనాల క్రయవిక్రయాలతో రవాణాశాఖకు ఆదాయం పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో రూ.227.52కోట్లు ఆదాయం రాగా..ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.267.41కోట్ల ఆదాయం వచ్చింది. రూ.39.89 అదనంగా ఈ మాసంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. 2019-20 ఏడాది ఏప్రిల్లో 10,556 ఫోర్ వీలర్స్ వాహనాలు విక్రయించగా, 2020-21లో కేవలం మూడు వాహనాలు మాత్రమే అమ్మకం జరిగాయి. ఈ ఏడాదిలో వాహన విక్రయాలు క్రమక్రమంగా పెరిగినప్పటికీ.. గత ఏడాదిలో పోల్చితే మాత్రం తగ్గినట్లు రవాణాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వాహనాల అమ్మకాలు
వాహనాలు | 2019-20లో అమ్మకాలు | 2020-21లో అమ్మకాలు |
ద్విచక్ర వాహనాలు | 3,76,596 | 2,62,289 |
ఫోర్ వీలర్స్ | 62,099 | 42,178 |
ఇతర వాహనాలు | 61,036 | 50,062 |
మొత్తం వాహనాలు | 4,99,731 | 3,54,529 |
వాహనాలు అమ్మడం ద్వారా రవాణాశాఖకు వచ్చిన ఆదాయం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు.
నెల | 2019-20(రూ.కోట్లలో) | 2020-21(రూ.కోట్లలో) |
ఏప్రిల్ | 345.55 | 20.58 |
మే | 252.39 | 110.03 |
జూన్ | 262.31 | 239.23 |
జులై | 304.85 | 276.44 |
ఆగస్టు | 253.28 | 246.28 |
సెప్టెంబర్ | 227.52 | 267.41 |
మొత్తం | 1,645.90 | 1,159.97 |
ఇవీ చూడండి: ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా హైదరాబాద్