ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: తగ్గిన వాణిజ్య పన్నుల వసూళ్లు - lock down effect on income

తెలంగాణలో గడిచిన ఆర్థిక ఏడాదిలో ఆశించిన స్థాయిలో వాణిజ్య పన్నులు వసూలు కాలేదు. 2019-20 ఆర్థిక సంత్సరంలో కేవలం 5 శాతం వృద్ధిని కనపరిచినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెల నుంచి పన్నుల రాబడి పూర్తిగా పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

corona effect on commercial taxes in telangana
కరోనా ఎఫెక్ట్​: తగ్గిన వాణిజ్య పన్నుల వాసూళ్లు
author img

By

Published : Apr 7, 2020, 11:06 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రభావం ఆదాయం తెచ్చి పెట్టే శాఖలపై తీవ్రంగా పడింది. వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించడం వల్ల పన్నుల వసూళ్లు దాదాపు ఆగిపోయాయి. ప్రతిరోజు వివిధ శాఖల నుంచి రూ.400 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా.. అందులో రెండు, మూడు శాతం కూడా రావడం లేదు. మద్యం విక్రయాలు పూర్తిగా ఆగిపోయి.. ఆ శాఖ నుంచి వచ్చే రాబడి నిలిచిపోయింది.

చమురు విక్రయాలు సగానికి పడిపోయాయి

ఇక పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు సగానికిపైగా పడిపోయాయి.. తద్వారా వచ్చే రాబడి కూడా తగ్గింది. ఇక భూములు, వాహనాల రిజిస్ట్రేషన్లు దాదాపు నిలిచిపోయాయి. ఇలా రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే శాఖలన్నీ లాక్‌డౌన్‌తో పూర్తిగా పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కష్టమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక క్రమశిక్షణ

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొవడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించి.. వృథా వ్యయాల కట్టడికి శ్రీకారం చుట్టింది. రానున్న రోజుల్లో వైరస్‌ వ్యాప్తి ఏలా ఉంటుందో స్పష్టత లేనందున.. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఏలాంటి ఇబ్బందులు లేకుండా సమర్ధంగా ఎదుర్కొనేందుకు నిధులు సమీకరణ చేసుకొని సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మద్యం అమ్మకాలతో స్వల్పంగా పెరిగిన ఆదాయం

2019-20 ఆర్థిక సంవత్సరంలో గత నెల చివర నాటికి 47వేల 658 కోట్లు రూపాయలు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాబడి వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పెట్రోల్‌ ద్వారా రూ.10 వేల 131 కోట్ల రాబడి రాగా.. గత ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం స్వల్పంగా తగ్గిందని చెప్పొచ్చు. మద్యం అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా రూ.9 వేల 860 కోట్లు ఆదాయం వచ్చి.. 4 శాతం వృద్ధి కనబరిచింది.

పరిహారం కింద రాష్ట్రానికి రెండు వేల 266 కోట్లు

వస్తు సేవల పన్ను రాబడులను పరిశీలిస్తే.. అంతకు ముందు ఏడాది కంటే ఒక్క శాతం తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 25వేల 764 కోట్లు రూపాయలు రాగా.. 2019-20లో రూ.25 వేల 404 కోట్లు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో జీఎస్టీ కౌన్సిల్‌ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌ కంటే తక్కువ వస్తు సేవల పన్ను రాబడులు రావడం వల్ల గత ఏడాది పరిహారం కింద రాష్ట్రానికి రెండు వేల 266 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ పరిహారం రావడంతోనే.. ఐదు శాతం వృద్ధి కనపరిచింది.

ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.