కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రాఘవయ్య పార్కులో కరోనా వైరస్ నమూనాలతో చెత్తబుట్టలను ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమూనాలు ప్రదర్శించి... ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. బయటకు వచ్చిన వారు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష