హైదరాబాద్ పాతబస్తీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వైరస్ను అరికట్టేందుకు అధికారులు కొత్తగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట సర్కిల్లో కేసులు అధికంగా ఉన్న ఉప్పుగూడ, తనాజీ నగర్, అరుంధతి కాలనీ, పటేల్ నగర్, చాంద్రాయణగుట్ట, కుమార్ వాడి, రియాసత్ నగర్, బాబా నగర్లలో కలిపి మొత్తంగా 13 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ బయటకు రాకుండా వీధులు, దారులు మూసివేశారు.
చాంద్రాయణగుట్టలో శనివారం 38 మందికి పాజిటివ్ నిర్ధరణ కాగా మొత్తం కేసులు సంఖ్య 518కి ఎగబాకింది. చార్మినార్ సర్కిల్లో హరి బౌలి బేలా రోడ్, హరి బౌలి అశోక్ లాట్, మొగల్ పుర గ్రౌండ్, మొగల్ పుర కమాన్ ,మొగల్ పుర వాటర్ ట్యాంక్, సుల్తాన్ షాహీ మెహర్ బాన్ హోటల్ సమీపంలో ఇస్రత్ మహల్ రోడ్, కోట్ల అలీజ గల్లీ, మొగల్ పుర ఫైర్ స్టేషన్ ముందు రోడ్, తదితర ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు. చార్మినార్లో వరకు మొత్తంగా 676 వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'