ETV Bharat / state

గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో కొనసాగుతోన్న కరోనా విజృంభణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా సిబ్బందితోపాటు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో చేసిన పరీక్షల్లో అనేక మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

corona cases increase in Greater Hyderabad
గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో కొనసాగుతోన్న కరోనా విజృంభణ
author img

By

Published : Jun 19, 2020, 11:05 PM IST

గ్రేట‌ర్ హైద‌రాబాద్​లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. జీహెచ్​ఎంసీ కాప్రాసర్కిల్‌లో ఎనిమిది మంది ఎంటమాలజీ శానిటేషన్ సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధరించారు. మరికొందరి సిబ్బంది రిపోర్టులు రావాల్సి ఉంది. అటు జీహెచ్​ఎంసీ ఖైరతాబాద్ జోన్‌లో ఓ ఉన్నతాధికారిణికి కరోనా నిర్ధరణ కాగా.. ఖైరతాబాద్ జోనల్ కార్యాలయాన్ని శుద్ధి చేశారు.

వైద్య ఆరోగ్యశాఖలో

బీఆర్‌కే భవన్‌లో ఇవాళ మరో ఇద్దరు వైరస్‌బారిన పడ్డారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి......., మైనార్టీ సంక్షేమశాఖలో పొరుగుసేవల్లో పనిచేస్తున్న మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇప్పటికే బీఆర్కే భవన్‌లో ఆరుగురు కరోనా బారినపడగా.... ఈ కేసులతో బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

నేతాజీనగర్‌లో మహిళలకు

అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో 4 కేసులు వెలుగుచూడగా, ఎర్రగడ్డ డివిజన్ నేతాజీనగర్‌లో ఇద్దరు మహిళలకు కరోనా సోకింది. పహాడీషరీఫ్ జ‌ల్‌పల్లి శ్రీరామకాలనీలో ఒకరికి, నార్సింగి హెల్త్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఇద్దరికి వైరస్ సోకింది. గచ్చిబౌలి కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 95 మందికి పరీక్షలు చేయగా ఇంకా 15 మంది నివేదికలు రావాల్సి ఉంది.

ఇదీ చూడండి : కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.