రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ఈ సాయంత్రం ఐదున్నర గంటల వరకూ.. 97,751 పరీక్షల ఫలితాలు రాగా.. 1,436 పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా బారిన పడి మరో 14 మంది మరణించారు.
తాజాగా మహమ్మారి నుంచి 3,614 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 27,016 క్రియాశీల కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 184 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. ఖమ్మం జిల్లాలో 148, నల్గొండ జిల్లాలో 118 కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి: Covaxin: పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ షురూ