ETV Bharat / state

ఏపీ సీఎం నివాస ప్రాంతంలో పెరుగుతున్న కరోనా కేసులు - తాడేపల్లిలో కరోనా కేసులు

ఏపీ ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీఎం నివాసానికి అతి సమీపంలో ఉన్న క్రిస్టియన్ పేటలో 4 కేసులు నమోదయ్యాయి.

carona Cases Increase
ఏపీ సీఎం నివాస ప్రాంతంలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jun 4, 2020, 5:11 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తాడేపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కరకట్ట, ఉండవల్లి కూడలి, సీఎం నివాసానికి అతి సమీపంగా ఉన్న క్రిస్టియన్ పేటలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు ఉన్నట్లు గుర్తించారు.వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పురపాలక అధికారులు శానిటేషన్ పనులు చేపట్టారు.

ఇదీ చవదండి: ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.