ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

corona-cases-in-telangana

author img

By

Published : Aug 9, 2020, 8:36 AM IST

Updated : Aug 9, 2020, 1:42 PM IST

08:32 August 09

రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి
corona-cases-in-telangana
రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు... జిల్లాల్లోనూ వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతోంది. కొత్తగా రాష్ట్రంలో 1,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79 వేల 495కు చేరింది. వైరస్​ బారిన పడి తాజాగా 12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 627 మంది కరోనా కారణంగా మృతి చెందారు.  

కొవిడ్​ నుంచి 55, 999 మంది బాధితులు కోలుకోగా... 22, 869 మంది వైరస్​తో పోరాడుతున్నారు. 16వేల 112 మంది హోం, ఇనిస్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 463 పాజిటివ్​ కేసులతో మొదటి స్థానంలో ఉండగా... మేడ్చల్ 141, రంగారెడ్డి 139 కేసులతో తరువాత స్థానంలో ఉన్నాయి. కరీంనగర్​ 96, జోగులాంబ గద్వాల 93, జనగామ 78, పెద్దపల్లి, వరంగల్​ అర్బన్​ జిల్లాలలో 71 మంది వైరస్ బారిన పడ్డారు. భద్రాద్రిలో 64, కామారెడ్డి 62, నల్గొండ 59, నిజామాబాద్‌ జిల్లాలో 58, సిద్దిపేట జిల్లాలో 55 పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో మరణాల సంఖ్య 2.03శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.78 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కోలుకుంటున్న వారి సంఖ్య సైతం దేశంలో 68.32 శాతం కాగా... రాష్ట్రంలో కాస్త మెరుగ్గా 70.44 శాతంగా ఉందని తెలిపింది. 21 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలోనే ఎక్కువ కేసులు వెలుగుచూస్తున్నాయని... వారిలోనూ మగవారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని పేర్కొంది.

Last Updated : Aug 9, 2020, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.