Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 3,980 మంది కొవిడ్ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,075 కి చేరింది. వైరస్ నుంచి మరో 2,398 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,673 క్రియాశీల కేసులున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 97,113 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు నాలుగు వేల మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,439 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అలసత్వం వహించొద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Cyber Criminals Robbed: సైబర్ నేరగాళ్ల మాయ.. మహేశ్ బ్యాంకులో రూ. 12 కోట్ల లూటీ