ETV Bharat / state

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి - మాస్క్ తప్పనిసరి పెట్టాల్సిందే గురూ

Corona Cases in Telangana : రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే, గడ్డుకాలం రాకుండా గట్టెక్కవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఉన్న సౌకర్యాలు, సమకూర్చుకోవాల్సిన అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకనుంచి ఎలా పనిచేయాలి అనే అంశంపై మంత్రి మార్గనిర్దేశం చేశారు.

Covid Cases Increased in Telangana
Covid Cases Increased in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 9:38 AM IST

కరోనాపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర సమీక్ష

Corona Cases in Telangana : తెలంగాణలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా కేసుల పట్ల, అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Raja Narasimha) తెలిపారు. కొవిడ్ నిర్మూలన కోసం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా వివిధ ఆసుపత్రిలో వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ కన్సన్ట్రేటర్లను తక్షణమే ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

Health Minister Damodar Raja Narasimha Review on Covid Cases : ప్రస్తుతం వాడుకలో లేని వెంటిలేటర్లను పునరుద్ధరించాలని దామోదర రాజనర్సింహ చెప్పారు. దీంతో పాటు కరోనా వార్డులలో అవసరమైన యంత్రాలను, డ్రగ్స్, డయాగ్నోస్టిక్ పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేసేందుకు ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 34 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు, ప్రైవేట్‌ పరిధిలో 84 ఉన్నట్టు అధికారులు, మంత్రికి వివరించారు.

న్యుమోనియా బాధితుల్లో కొవిడ్! - నిలోఫర్ ఆసుపత్రిలో 14 నెలల బాలుడిలో వైరస్​ నిర్ధరణ

రాష్ట్రంలో రోజూ 16,500 మందికి పరీక్షలు జరిపేలా వసతులు : రోజూ 16,500 మందికి పరీక్షలు నిర్వహించేలా వసతులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు వారాలుగా 6344 శాంపుల్స్ సేకరించినట్లు పేర్కొన్నారు. గత వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబులలో కలిపి మొత్తంగా 40 ఆర్టీపీసీఆర్ నమూనాలు (RTPCR Tests in Telangana) తీసుకున్నామని, వాటి ఫలితాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని వారు వివరించారు. డిసెంబర్ ముగిసే నాటికి రోజుకు 4,000 మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకోవాలని దామోదర రాజనర్సింహ అన్నారు. రోజూ సాయంత్రం 4 గంటల లోపు డైలీ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.

శనివారం 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించిన అధికారులు రాష్ట్రంలో శనివారం 12 మందికి కొవిడ్ (Covid Cases in Telangana) సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో హైదరాబాదులో 9, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్‌లో ఒక్కోటి నమోదయ్యాయి. బాధితుల్లో ఒకరు రికవరీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను ఎక్కువ మొత్తంలో ప్రొక్యూర్ చేయాలని దామోదర రాజనర్సింహ, అధికారులను ఆదేశించారు. పాజిటివ్‌గా నిర్దారణ అయిన శాంపుల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆసుపత్రికి పంపించాలని తెలిపారు.

'కరోనా న్యూ వేరియంట్​పై అప్రమత్తంగా ఉండాలి - స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి'

ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి: క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని దామోదర రాజనర్సింహ కోరారు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించడంతో పాటు, పరిశుభ్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగా కొవిడ్ విలయతాండవం చేయకుండా ఉండాలంటే, వైద్యులే కాకుండా పౌరులు కూడా వ్యక్తిగత బాధ్యతగా మాస్కులు పెట్టుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు పాటించాలని దామోదర రాజనర్సింహ కోరారు.

కొత్త వేరియంట్​తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు

'ప్రతి 3 నెలలకోసారి మాక్ డ్రిల్​'- కొవిడ్ కేసులపై కేంద్రం అలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.