ETV Bharat / state

ముషీరాబాద్​ నియోజకవర్గంపై కరోనా పంజా... 1500కు చేరిన కేసులు - corona case in telangana

నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముషీరాబాద్​ నియోజకవర్గంలో ఇప్పటికే 1500 కేసులు నమోదు కాగా... ఆయా డివిజన్​లలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నియోజకవర్గంలో అత్యధిక కేసులు నమోదవుతున్న వేళ... అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

corona cases in musheerabad constituency

author img

By

Published : Jul 22, 2020, 8:15 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బోలక్​పూర్, రామ్​నగర్, ముషీరాబాద్, గాంధీనగర్, కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్లలో ఇప్పటి వరకు 1544 మంది కరోనా వైరస్​ బారిన పడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా కవాడిగూడ, గాంధీనగర్, రాంనగర్, బోలక్​పూర్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

కొవిడ్​ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా నియోజకవర్గంలోని కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో శానిటైజేషన్​ చేయట్లేదని స్థానికులు ఆరోపించారు. కరోనా నివారణ విషయంలో ప్రభుత్వ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.