రాష్ట్రంలో ఇవాళ 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మెుత్తం కేసుల సంఖ్య 970కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 13, జోగులాంబ గద్వాల జిల్లాలో10 కేసులు నమోదయ్యాయి. ఈరోజు వివిధ ఆసుపత్రుల నుంచి 58 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 25కు చేరింది.
రాష్ట్రంలో కరోనా టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 9 ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి ఈటల తెలిపారు.