కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ మొదటి గజల్ గాయని స్వరూప రెడ్డి పాడిన పాటను సైబరాబాద్ సీపీ సజ్జనార్ తన కార్యాలయంలో విడుదల చేశారు. కరోనా నియంత్రణలో మొదటి వరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వివరిస్తూ ఈ పాట రూపొందించినట్లు బృందం వివరించింది. 'రక్షకుడా జయం జయం' అంటూ సాగే ఈ పాటను ద్యావారి నరేంద్ర స్వరపరచగా... బాజి సంగీతం అందించారు.
ఇదీ చూడండి: పింఛన్దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?