ETV Bharat / state

కరోనాపై ఆందోళన వద్దు.. మనోధైర్యమే మందు

కరోనా నుంచి కోలుకున్న వారిలో 28 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారే ఉన్నారంటూ నిపుణులు వెల్లడించారు. 40 పైబడ్డ వారిలో 46 శాతం మంది ఆరోగ్యంగా ఇళ్లకు వెళ్లారని తెలిపారు. అయినా.. ముందు జాగ్రత్తలే మేలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

corona-awareness-programs
కరోనాపై ఆందోళన వద్దు.. మనోధైర్యమే మందు
author img

By

Published : Apr 21, 2020, 7:08 AM IST

కరోనా మాట వినబడితేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇది సోకిన వారందరిలోనూ ప్రాణాంతకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఈ వయస్సు వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బు ఉండటం అధికమని విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాధులేమీ లేకపోతే 60 ఏళ్లు దాటినా కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇళ్లకెళ్లవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మహమ్మారి కోరల్లోంచి కోలుకున్న వారి గణాంకాలను పరిశీలించినా.. ఇదే తేటతెల్లమవుతోంది.

50 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 28 శాతం మంది ఇప్పటి వరకూ కోలుకోవడం విశేషం. 61 ఏళ్లు పైబడినవారు 11 శాతం మంది కోలుకోగా, 40 ఏళ్లు దాటిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. 46 శాతం మంది ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. 20-40 ఏళ్ల యువతలో కోలుకునేవారు అత్యధికంగా 47 శాతం మంది ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం విడుదల చేసిన గణాంకాల్లోనూ రాష్ట్రంలో త్వరగా కోలుకునేవారు 22 శాతంగా వెల్లడించారు. ఇది జాతీయ సగటు(14శాతం) కంటే ఎక్కువ. దేశం మొత్తం మీద నమోదవుతున్న మృతుల శాతం(3.22)తో పోల్చితే.. రాష్ట్రంలో మృతుల(2.44) శాతమూ తక్కువే. కరోనా బారిన పడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మానసిక ధైర్యంతో వైరస్‌ను ఎదుర్కోవడం సాధ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.

* వైరస్‌ నిర్ధారించిన 14 రోజుల్లోనే కోలుకున్న వారిలో 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు, 19 ఏళ్ల యువకుడు, 65 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు.

* వీరిలో ఈనెల తొలిరోజుల్లో గుర్తించిన వారూ ఉండటం విశేషం. కేవలం 14-17 రోజుల్లోనే వీరిలో నెగిటివ్‌గా పరీక్షల్లో తేలింది.

* రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి 2న నమోదు కాగా, తర్వాత 30 రోజుల్లో 100 మందిలో వైరస్‌ నిర్ధారించగా.. వీరిలో దాదాపు 90 శాతం మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లారు.

* వైరస్‌ నిర్ధారించి 30 రోజులు గడిచినా ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు 60 ఏళ్లు దాటినవారే. వీరిలోనూ మధుమేహం, గుండెజబ్బు, తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే ఉన్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

corona-awareness-programs
కరోనాపై ఆందోళన వద్దు.. మనోధైర్యమే మందు

రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలి

వైరస్‌ సోకిన వారిలో 81 శాతం మందిలో లక్షణాలేమీ బయటకు కనిపించకుండానే వెళ్లిపోతుంది. 14 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. మరో 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ చికిత్స అవసరమవుతుంది. ఆసుపత్రిలో చేరిన వారిలోనూ అత్యధికులు పూర్తి ఆరోగ్యవంతులుగా కోలుకుంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్న వారిలో మాత్రమే వైరస్‌ దుష్ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్​ శంకర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్రివెంటివ్​ మెడిసిన్​ సంచాలకులు తెలిపారు. ఇవేమీ లేకపోతే 65 ఏళ్లు దాటినవాళ్లు కూడా ఆరోగ్యంగా ఇంటికెళ్లడానికి అవకాశాలెక్కువ. వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత దూరం పాటించాలి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి వైరస్‌నైనా ఎదిరించొచ్చు.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయాలు.. రేపటి నుంచే అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.