ETV Bharat / state

బస్తీ పోరులో ఓటేయాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి! - కరోనా నిబంధనల నడుమ జీహెచ్ఎంసీ ఎన్నికలు

గ్రేటర్ ఎన్నికలకు జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. కరోనా నేపథ్యంలో ఈసారి కొవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్​ తప్పనిసరిగా వాడాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ సిబ్బంది కరోనా కిట్లు, శానిటైజర్లు.. భౌతిక దూరం పాటించేలా క్యూలైన్​లు ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరు నిబంధనల ప్రకారం తమ హక్కును వినియోగించుకోవాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీచేసింది.

బస్తీ పోరులో ఓటేయాలంటే కొవిడ్ నిబంధనలు తప్పనిసరి!

author img

By

Published : Nov 29, 2020, 7:37 PM IST

డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం గ్రేటర్​లోని 150 డివిజన్​లలో 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నగరంలోని 74 లక్షలకు పైగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కొవిడ్ నిబంధనల ప్రకారం...

అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా ఒకరోజు ముందు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజ్ చేయనున్నారు. నవంబర్ 1 తరువాత కరోనా పాజిటివ్ వచ్చిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఎస్ఈసీ కల్పించింది. వీరితో పాటు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు కరోనా నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్​కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్​ను ఆన్​లైన్​తో పాటు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్​కు కూడా అధిక శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.

కరోనా బాధితులు కూడా...

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోని కరోనా పాజిటివ్ ఓటర్లకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే సౌకర్యాలు కల్పించింది. బాధిత ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. వారంతా మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఓటు వేయాలని స్పష్టం చేసింది. గ్రేటర్​లోని 30 సర్కిళ్లలోని సహాయ వైద్య అధికారులను సర్కిల్ స్థాయిలో కొవిడ్ నోడల్ అధికారులుగా జీహెచ్ఎంసీ నియమించింది.

కరోనా కిట్లు...

సర్కిల్ లెవల్ అధికారులు, వార్డు స్థాయి కొవిడ్ అధికారులను నియమించారు. గ్రేటర్​లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి లక్ష 20 వేల కరోనా కిట్లను అందించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 10 కరోనా కిట్లు ఎన్నికల విధులు నిర్వహించే వారి కోసం అందజేస్తున్నారు.

సూచనలు...

500 మి.లీల శానిటైజర్లను ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున అందించేందుకు 60 వేల శానిటైజర్లు సిద్ధం అందుబాటులో ఉంచారు. నోడల్ వైద్యాధికారులు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్లు ఉపయోగించేలా, మాస్కులు ధరించేలా సూచనలు చేయనున్నారు.

ఇదీ చూడండి: ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.