హైదరాబాద్ అంబర్ పేటలోని తురబ్ నగర్లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు భద్రత, భరోసాను కల్పించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహించామని మలక్ పేట ఏసీపీ వెంకటరమణ తెలిపారు. కాలనీ వాసులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. మాక్స్ విజన్ అనే సంస్థ ద్వారా సీసీటీవీ ప్రాముఖ్యతను కాలనీవాసులకు చెప్పామని పేర్కొన్నారు.
భద్రతా కోసం అధునాతన టెక్నాలజీ వ్యవస్థ కలిగిన కాల్ డేటా ఆనలైజ్, డయల్ 100, హాక్ ఐ అప్లికేషన్ లాంటివని వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. నగర పోలీసులు చేపడుతున్న భద్రతాపరమైన చర్యలు, వాటి ప్రాముఖ్యతలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించామన్నారు.