హైదరాబాద్ అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. గన్ ఫౌండ్రిలోని పలు బస్తీలలో అబిడ్స్ ఏసీపీ భిక్షం రెడ్డి నేతృత్వంలో 150మంది పొలీసులతో సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలతో పాటు ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలు, ఆధారాలు చూసిన తర్వాతే అద్దెకు ఇవ్వాలని ఇంటి యాజమానులకు పోలీసులు సూచించారు. ప్రజల్లో ధైర్యం కల్పించడం కోసమే కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నట్లు ఏసీబీ భిక్షం రెడ్డి తెలిపారు.
ప్రజలకు భరోసా కల్పించేందుకే కట్టడి ముట్టడి
ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు ఉన్నారని చెప్పడమేగాక వారిలో ఆత్మస్థైర్యం, భరోసా కల్పించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.