ETV Bharat / state

'పెట్రోల్​ బంక్​ యంత్రాల్లో చిప్​ మార్చే వీల్లేకుండా చేయాలి' - సైబరాబాద్​ పోలీసుల తాజా వార్తలు

పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లతో మోసాల కట్టడికి అధికారుల చర్యలు చేపట్టారు. ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థలు బంకుల్లోని యంత్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం సహా చిప్‌ మార్చకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీసులు సూచించారు. చిప్‌ మార్చే వీల్లేకుండా... యంత్రాల్లో కీలకమైన మదర్‌ బోర్డును సీల్‌ చేయాలని సంబంధిత ఓటీపీ, ఇతర వివరాలు కేవలం యంత్రం నిర్వహించే సాంకేతిక నిపుణుడికి మాత్రమే ఇవ్వాలని తూనికలు కొలతల శాఖ అధికారులు పేర్కొన్నారు.

'పెట్రోల్​ బంక్​ యంత్రాల్లో చిప్​ మార్చే వీల్లేకుండా చేయాలి'

author img

By

Published : Sep 9, 2020, 6:10 AM IST

పెట్రోల్‌ బంకుల్లో చిప్‌ అమర్చి వినియోగదారుల్ని మోసం చేసే వ్యవహారాన్ని పూర్తిగా అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తూనికల కొలతల శాఖ, ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సైబరాబాద్‌ పోలీసులు సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు.

ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థలు బంకుల్లోని యంత్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం సహా చిప్‌ మార్చకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీసులు సూచించారు. చిప్‌ మార్చే వీల్లేకుండా... యంత్రాల్లో కీలకమైన మదర్‌ బోర్డును సీల్‌ చేయాలని సంబంధిత ఓటీపీ, ఇతర వివరాలు కేవలం యంత్రం నిర్వహించే సాంకేతిక నిపుణుడికి మాత్రమే ఇవ్వాలని తూనికలు కొలతల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని పెట్రోల్‌ బంకుల్ని అప్రమత్తం చేసినట్లు ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. వినియోగదారులు మోసపోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.