ప్రతి మండలానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని, మొత్తంగా 434 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సహకార శాఖలో ప్రమోషన్ల విషయంలో అన్ని అడ్డంకులు అధిగమించి ఉద్యోగులందరికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. సహకార సంఘాల పట్ల ఉన్న చిన్న చూపును చెరిపేసేందుకు సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో క్యాలెండర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి క్యాలెడంర్, డైరీని సోమవారం ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పడింది