హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ ఎదుట ఒప్పంద నర్సులు మరోసారి ఆందోళనకు దిగారు. విధుల్లో నుంచి తొలగించిన తమను మళ్లీ తీసుకోవాలని నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు.
తాము ఆందోళన చేసేందుకు రాలేదని.. వినతి పత్రం సమర్పించేందుకు వచ్చామని చెప్పినా వినకుండా పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అటు నర్సులు ప్రగతిభవన్ ముట్టడిస్తున్నారనే సమాచారంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు.
ఇదీ చూడండి: NURSES Protest: ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన నర్సులు.. ఉద్రిక్తత