ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆ యూనియన్ అధ్వర్యంలో 12 గంటలపాటు ధర్నా నిర్వహించారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 21 అమలు చేసి కాంట్రాక్ట్ యాక్టు 1970 ప్రకారంగా వేతనాలు పెంచాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ కోరారు.
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 27మంది వరకు శానిటేషన్, 5వేల మంది సెక్యూరిటీ మరో 3వేల మంది పెషెంట్కేర్ విభాగాల్లో కాంట్రాక్టు వర్కర్లు పనిచేస్తున్నారని యూసుఫ్ తెలిపారు. వీరందరికి పండుగ, జాతీయ సెలవుతోపాటు ప్రసూతి సెలవులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలన్నారు. తమ డిమాండ్లు పట్టించుకోకుంటే.. తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: medical students wearing helmets: హెల్మెట్లు ధరించిన జూనియర్ వైద్యులు