ETV Bharat / state

కంటోన్మెంట్​ అధికారులు.. క్రికెట్​లో అదరగొట్టారు - కంటోన్మెంట్ అధికారుల క్రికెట్ మ్యాచ్​

ఎల్లప్పుడు పని ఒత్తిడిలో ఉండే కంటోన్మెంట్ అధికారులు ఉత్సాహంగా క్రికెట్ మ్యాచ్​ ఆడారు. ఆదివారం ఆటవిడుపుగా సికింద్రాబాద్​ బొల్లారంలోని పార్కులో అడ్మిన్​ అటాకర్స్​, హెల్త్​ టీం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో అడ్మిన్​ అటాకర్స్ విజయం సాధించింది.

comtonment officers cricket match in bollaram park
క్రిెకెట్​ మ్యాచ్​ ప్రారంభానికి ముందు టాస్​ వేస్తున్న అధికారులు
author img

By

Published : Feb 7, 2021, 5:23 PM IST

నిత్యం ప్రజలకు సేవ చేస్తూ బిజీగా గడిపే కంటోన్మెంట్ అధికారులు సరదాగా క్రికెట్ మ్యాచ్​ ఆడారు. సికింద్రాబాద్​ బొల్లారంలో కంటోన్మెంట్ పార్కులో జరిగిన క్రికెట్ మ్యాచ్​లో అధికారులు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. అడ్మిన్ అటాకర్స్, హెల్త్ టీం జట్ల మధ్య ఫైనల్ జరిగింది.

హెల్త్ టీం 10 ఓవర్లలో 73 పరుగులు సాధించగా.. అడ్మిన్ అటాకర్స్ 73 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డి సిక్సర్లతో ఆకట్టుకున్నారు. బౌలింగ్​ ప్రదర్శనతో రెండు వికెట్లు పడగొట్టి ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్​లో డిప్యూటీ సీఈఓ బాల నాయర్, ఎన్నికల విభాగం అధికారి పరశురామ్, సానిటరీ ఇన్​స్పెక్టర్​ మహేందర్, నీటి విభాగానికి చెందిన రాజ్ కుమార్, దేవేందర్, కంటోన్మెంట్ స్టాఫ్ పాల్గొన్నారు .

ఇదీ చూడండి : ఒకే రోజు.. ఒక్క గంటలో కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.