ETV Bharat / state

రాష్ట్రంలో కొనసాగుతున్న వరుణ ప్రతాపం.. పలువురు గల్లంతు - భారీ వర్షాలకు గల్లంతవుతోన్న పలువురు తెలంగాణ

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వాగులు పొంగుతూ, మత్తళ్లు దూకుతూ ఎక్కడికక్కడ గ్రామాలను జలదిగ్బంధం చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాగులో నీటి ప్రవాహాన్ని తక్కువ అంచనా వేస్తూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న వరుణ ప్రతాపం.. పలువురు గల్లంతు

author img

By

Published : Sep 26, 2020, 10:38 PM IST

రాష్ట్రంలో కొనసాగుతున్న వరుణ ప్రతాపం.. పలువురు గల్లంతు

భారీ వానలు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో పెద్దవాగు, ఊక చెట్టు, బండారుపల్లి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల వద్ద వాగులో చేపలవేటకు వెళ్లిన యువకుడు నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు తాడు సాయంతో క్షేమంగా ఒడ్డుకుచేర్చారు. పరిధిపూర్‌ జలాశయం పొంగిపొర్లడం వల్ల అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జోగులాంబ గద్వాల నందిన్నే వాగుపై తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు మరోసారి కొట్టుకుపోయింది. చాలా ప్రాంతాల్లో చెరువుకట్టలు తెగి పంటలు నీటమునిగాయి.

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సూచనలు

మహబూబ్‌నగర్‌లో వరదనీరు పోటెత్తి రామయ్యబౌలీ, బీకేరెడ్డి, బృందావన్‌ తదితర కాలనీలు జలమయమయ్యాయి. నాలాల పరిమాణం కుదించి కబ్జా చేయడం వల్లే తమ కాలనీలకు ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాలనీల్లో పర్యటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాలాలు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. సిద్దిపేటలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఉప్పొంగడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెక్‌డ్యామ్‌లు, వాగుల వరద ఉద్ధృతికి పంటలు నీటమునిగాయి. నారాయణఖేడ్‌ శివారులో వర్షాలకు కోతకు గురైన రోడ్లను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరిశీలించారు. మనోహరాబాద్‌ రామయపల్లి వద్ద రైల్వే అండర్‌పాస్​లో భారీగా నీరు నిలిచినందున రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.

నీరు ఎత్తిపోయలేక అవస్థలు

ఉమ్మడి వరంగల్‌ను వానలు ముంచెత్తాయి. జిల్లాలోని మున్నేరు, పాకాల, వట్టి వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో రహదార్లపై వరద ఉద్ధృతంగా ఉండటం వల్ల పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 18 సెంటీమీటర్ల భారీ వర్షానికి జలమయమైన కాలనీల్లో... ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోయలేక నానా అవస్థలు పడ్డారు. కొందరు స్థానిక కమ్యూనిటీ హాళ్లలో తలదాచుకున్నారు. చాలా గ్రామాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లోనూ వాగులు పొంగి పొర్లుతున్నాయి.

పలువురి గల్లంతు

వాగులో నీటి ప్రవాహాన్ని తక్కువ అంచనా వేస్తూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విశ్వనాథ్‌పూర్‌, తంగెళ్లపల్లి మధ్య వరద పోటెత్తుతుండగా.. దుస్సాహసం చేసి అందరూ చూస్తుండగానే వరదలో గల్లంతయ్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం గుండాలలో.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు యత్నించిన వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయి పల్లి వద్ద.. ద్విచక్రవాహనంతో పాటు ఇద్దరు వాగులో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు.

ఇదీ చదవండి: ఏకధాటి వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.