ETV Bharat / state

సికింద్రాబాద్​ పరిసరాల్లో కంటైన్మెంట్​ జోన్ల ఏర్పాటు

author img

By

Published : Jun 30, 2020, 7:36 PM IST

సికింద్రాబాద్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా నిర్ధరణ అయిన బాధితుల ఇళ్ల సమీపంలో అధికారులు కంటైన్మెంట్​ జోన్లు ఏర్పాటు చేశారు. వైరస్​ వ్యాపించకుండా స్థానికులెవరూ బయటకు రావద్దని ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రసాయనాల పిచికారీ చేస్తున్నారు.

Containment Zones In Secundrabad Area
సికింద్రాబాద్​ పరిసరాల్లో కంటైన్మెంట్​ జోన్ల ఏర్పాటు

సికింద్రాబాద్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా కేసులు బయటపడిన ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటిస్తున్నారు. సికింద్రాబాద్​ పరిసర ప్రాంతాలైన చిలకలగూడ, మారేడుపల్లి, కార్ఖానా, బోయినపల్లి, వాసవినగర్​, అల్వాల్​ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్​ జోన్లుగా పరిగణిస్తూ ప్రకటన చేశారు.

బారికేడ్లు ఏర్పాటు చేసి.. రసాయన ద్రావణాలతో పిచికారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలనీ వాసులు స్వచ్ఛందంగా కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో స్థానికులే.. అధికారులను తమ ప్రాంతాలను కంటైన్మెంట్​గా ప్రకటించాలని కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించి కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.