Consumer Rights Organization: వ్యాపార సంస్థలు కొనుగోలు విషయంలో వినియోగదారులకు చేస్తున్న మోసంపై అవగాహన కల్పించేందుకు వినియోగదారుల హక్కుల సంస్థ కృషి చేస్తోందని సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు తెలిపారు. అందుకనుగుణగా సీటీ బజావో సీఆర్ఓ కే సాత్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.
వినియోగదారులు కొనుగోలు విషయంలో ఎదుర్కొంటున్న మోసాన్ని అరికట్టేందుకు విజిల్ కొట్టు మేలు కొలుపు అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలియచేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకై ఎన్ని చట్టాలు ఉన్నా అవగాహణ లేక ఎంతో మంది మోసపోతున్నారని చెప్పారు. వినియోగదారులు తమ హక్కులకు భంగం కలిగిందని సంస్థ దృష్టికి తీసుకువస్తే వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: లెదర్ వద్దంటూ పెటా వినూత్న పద్ధతిలో ప్రచారం..