రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఆసుపత్రి అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ సూచించారు. కొవిడ్-19 వ్యాధి చికిత్సకు మెరుగైన సదుపాయాలతో ఆస్పత్రి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి తాను రూ. 50లక్షల మొత్తాన్ని ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'