ETV Bharat / state

Nampally GHMC Parking Complex : పడకేసిన పార్కింగ్ కాంప్లెక్స్​ ​నిర్మాణపనులు... గడువులోగా పూర్తయ్యేనా..? - హైదరాబాద్​లో పార్కింగ్​ సమస్యలు

Nampally GHMC Parking complex : హైదరాబాద్​లో పార్కింగ్ సమస్యలు తీర్చేందుకు నిర్మిస్తున్న పార్కింగ్ కాంప్లెక్స్​ ఏళ్లు గడుస్తున్న ముందుకుసాగడం లేదు. ప్రతిష్ఠాత్మకంగా నాంపల్లిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ కాంప్లెక్స్​ శంకుస్థాపన చేసి 5 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కాలేదు. మరిన్ని పార్కింగ్​కాంప్లెక్స్​ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీకి చెందిన 42 చోట్ల ఏర్పాటుచేయాలని నిర్ణయించినా ఎలాంటి ముందడుగులేదు.

parking complex
parking complex
author img

By

Published : May 14, 2023, 7:15 PM IST

Updated : May 14, 2023, 7:30 PM IST

పడకేసిన పార్కింగ్ కాంప్లెక్స్​ ​నిర్మాణపనులు... గడువులోగా పూర్తయ్యేనా..?

Nampally GHMC parking complex delayed in hyderabad : హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలా మెట్రో స్టేషన్ల వద్ద వాహనాలు నిలిపేందుకు చోటు చాలడం లేదు. ఈ తరహా సమస్యల పరిష్కారం కోసం నాంపల్లిలో మొదటిసారి బహుళ అంతస్తుల అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ సముదాయం నిర్మాణం జరుగుతోంది. నిర్మాణపనులు తీవ్ర ఆలస్యంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు చెందిన నాంపల్లిలోని దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో అత్యాధునిక బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం పనులకు 2018 సెప్టెంబరు 8న భూమిపూజ చేశారు.

పీపీపీ భాగస్వామ్యంతో..: గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్ మధ్య పార్కింగ్ సముదాయం పనులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో.. రెండు ఇన్​ఫ్రా సంస్థలు సంయుక్తంగా నోవమ్ పేరుతో పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్​షిప్​) పద్దతిలో టెండర్​ను దక్కించుకున్నాయి. జర్మన్ సాంకేతికతతో రూ.60 కోట్ల అంచనాతో చేపట్టేందుకు ముందుకొచ్చాయి. 9 నెలల్లో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఘనంగా ప్రకటించాయి. ఇప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు.

నగరంలోనే మొదటిసారి..: ఈ పార్కింగ్ సముదాయంలో ఏకకాలంలో 250 కార్లు, 100 ద్విచక్రవాహనాలను నిలుపవచ్చు. వాహనం నిలిపితే ఆటోమేటిక్​గా ఖాళీ ఉన్న పార్కింగ్ ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఈ తరహా విధానం సిటీలో కొన్ని ప్రైవేటు సంస్థల్లో ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో రావడం ఇదే మొదటిసారి. ఈ సముదాయంలో కింది ఐదు అంతస్తుల్లో రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు ఉంటాయి. పై అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ ఉంటుంది.

నిధుల లేమి.. నాంపల్లిలో మొదటి పీపీపీ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించి.. సిటీలో ఇతర ప్రాంతాలలో మరిన్ని నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకోసం జీహెచ్‌ఎంసీకి చెందిన 42 స్థలాలను అన్వేసిస్తున్నా.. వాటి ఎంపికలో ఎలాంటి ముందడుగు లేదు. కోవిడ్ అనంతరం పీపీపీలో చేపట్టేందుకు నిర్మాణ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒక్కటి కూడా మొదలుకాలేదు. కొవిడ్​తో రెండేళ్లపాటు పనులు ఆగిపోయాయి. ఈ లోపు ప్రాజెక్ట్ వ్యయం పెరగడం, నిధుల సమస్యతో నిర్మాణ పనులు నిధానంగా నడుస్తున్నాయి.

గడువులోగా పూర్తయ్యేనా.. మరో నాలుగు నెలలు గడిచితే ప్రాజెక్ట్‌కి భూమి పూజ చేసి ఐదేళ్లు పూర్తవుతుంది. ఆలోపు అందుబాటులోకి తీసుకురావాలని మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ 15 అంతస్తుల్లో రాబోతోంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గోడ పనులు జరుగుతున్నాయి. జర్మన్ టెక్నాలజీతో కూడిన ఆటోమేటెడ్ పార్కింగ్ మెషీన్లను ఇక్కడకు దిగుమతి చేసి అమర్చనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 14, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.