ETV Bharat / state

డీజీపీ కార్యాలయం వద్ద కానిస్టేబుల్​ అభ్యర్థుల ఆందోళన - డీజీపీ కార్యాలయం వద్ద కానిస్టేబుళ్ల ఆందోళన

తమపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేయాలని హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని డీజీపీ కార్యాలయం ఎదుట 2018 బ్యాచ్​లో సెలక్టయిన కానిస్టేబుల్​ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సస్పెన్షన్​ను ఎత్తివేసి శిక్షణకు పంపించాలని కుటుంబసమేతంగా వచ్చి విజ్ఞప్తి చేశారు.

constable-candidates-protest-at-dgp-office-in-hyderabad
డీజీపీ కార్యాలయం ఎదుట సెలక్టయిన కానిస్టేబుల్​ అభ్యర్థుల ఆందోళన
author img

By

Published : Nov 20, 2020, 4:46 PM IST

హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని డీజీపీ కార్యాలయం ఎదుట 2018 బ్యాచ్ సెలక్టయిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమపై గతంలో ఉన్న కేసుల వివరాలు దరఖాస్తు ఫారంలో సమాచారం ఇవ్వలేదని.. తమను సస్పెన్షన్​లో పెట్టారని తెలిపారు.

తమకు అవగాహన లేకపోవడం వల్ల సమాచారం ఇవ్వట్లేదని.. ఇప్పుడు తమపై ఎలాంటి కేసులు లేవని వివరించారు. తమపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేసి.. శిక్షణకు పంపించాలని కుటుంబసమేతంగా వచ్చి అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ఎదుట వేడుకున్నారు.

ఇదీ చదవండిః స్నేహితుడి కోసం సస్పెండ్ అయిన కానిస్టేబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.