ETV Bharat / state

డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ - Constable candidate at hyderabad dgp office

హైదరాబాద్​ లక్డీకాపూల్​​లోని డీజీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న సెలక్టయిన కానిస్టేబుల్​ అభ్యర్థులను రవీంద్రభారతి వద్ద పోలీసులు అరెస్ట్​ చేశారు. సెలక్టయి నెలలు గడుస్తున్నా ట్రైనింగ్​ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

constable candidates arrested in lakdikapool hyderabad
డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్
author img

By

Published : Aug 19, 2020, 6:22 PM IST

సెలక్టయిన కానిస్టేబుల్​ అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ .. కానిస్టేబుల్​ అభ్యర్థులు హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. లక్డీకాపూల్​​లోని డీజీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న వారిని రవీంద్రభారతి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్​ చేసి రాంగోపాల్​పేట పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఏఆర్​, సివిల్ అభ్యర్థులకు ఒక న్యాయం, తమకో న్యాయమా అంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రశ్నించారు. సెలక్టయి నెలలు గడుస్తున్నా ట్రైనింగ్​ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోసం ఎదురుచూసి ఇప్పటికే ముగ్గురు చనిపోయారని.. తక్షణమే తమకు శిక్షణ తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.