ETV Bharat / state

CWC ఎన్నికల బరిలో రాష్ట్రం నుంచి.. ఆ ముగ్గురు..!

CWC elections 2023 : తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ముగ్గురు సీనియర్‌ నాయకులు పోటీ పడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవిలు పోటీ పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేవలం 12 మంది సభ్యుల ఎంపిక కోసం ఓటింగ్‌ జరగనుందని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

CWC elections
సీడబ్ల్యుసీ ఎన్నికలు
author img

By

Published : Feb 21, 2023, 9:28 AM IST

Updated : Feb 21, 2023, 9:36 AM IST

కాంగ్రెస్​ 85వ ప్లీనరీ సమావేశం

CWC elections 2023 : ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికైన తరువాత పూర్తి స్థాయిలో జాతీయ కార్యవర్గం ఏర్పాటుతోపాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుల ఎంపిక కూడా పూర్తి చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు రాయ్‌పూర్‌లో జరగనున్న 85వ ప్లీనరీ సమావేశంలో ఈ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ అధిష్ఠానం పూర్తి చేయనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు 24 మంది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఉంటారు. అందులో 11 మంది సభ్యులను నామినేట్‌ చేయనుండగా, మరో 12 మంది సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

Congress 85th Plenary Session : అయితే మొత్తం సీడబ్ల్యుసీ సభ్యుల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, యువత తదితర వర్గాలకు సగం రిజర్వేషన్‌లను వర్తింపచేస్తారు. మిగిలిన సగం మంది జనరల్‌ కోటా కింద ఎంపిక కావాల్సి ఉంది. సీడబ్ల్యుసీ సభ్యుల ఎంపికలో 1338 మంది ఏఐసీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎంపిక ప్రక్రియ ఈ నెల 26వ తేదీన జరగనుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అయితే ప్లీనరీలో మాత్రం ఏఐసీసీ సభ్యులతోపాటు 9,915 మంది ప్రదేశ్​ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, మరో 3000 మంది నామినేటెడ్‌ సభ్యులు మొత్తం కలిసి దాదాపు 15వేల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రం నుంచి ఎవరు పోటీ చేస్తారు: సీడబ్ల్యుసీ సభ్యులుగా ఎంపిక అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు సీనియర్‌ నాయకులు పోటీ పడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవిలు పోటీ పడాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల బరిలోకి దిగే ముందు వీరు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించి వారి మద్దతుతోనే బరిలో దిగుతారని చెబుతున్నారు.

రాష్ట్రం నుంచి ఎంత మందికి అవకాశం వస్తుంది: ఇదే జరిగినట్లయితే ఒక్కరే రాష్ట్రం నుంచి బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు నాయకుల మద్దతు అవసరం లేకుండా పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే ముగ్గురు నాయకులు కూడా బరిలో దిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది పక్కన పెడితే ఈ రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ సభ్యులు 33 మంది మాత్రమే ఓటు వేసే హక్కు కలిగి ఉంటారు.

అభ్యర్థిని ఇలా నిర్ణయిస్తారు: సీడబ్ల్యుసీ పదవి అనేది ఉన్నతమైనది అయ్యినందున కాంగ్రెస్‌ అధిష్ఠానం వివిధ అంశాలను ఆధారం చేసుకుని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీకి విధేయులుగా ఎంతకాలం నుంచి ఉన్నారు. ఇప్పటి వరకు ఏయే పదవులు అనుభవించారు.. ఆ సమయంలో పార్టీ బలోపేతానికి వారు చేసిన కృషి ఏమిటి అనే అంశాలతపాటు ఎంపిక కాబోయే నాయకుడు దేశంలో పార్టీ బలోపేతానికి ఏ మాత్రం ఉపయోగపడతారు అనేది పరిశీలించనున్నారు.

యూనిట్​గా ఎలా నిర్ణయిస్తారో: రాబోయేది ఎన్నికల సంవత్సరం అయ్యినందున సీడబ్ల్యుసీ సభ్యులు తీసుకునే నిర్ణయాలు కీలకం కానుండడం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తారని తెలుస్తోంది. అయితే రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటారా లేక దేశాన్ని యూనిట్‌ తీసుకుంటారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఒకవేళ రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకునేట్లు అయితే పోటీ చేసేందుకు చొరవ చూపుతున్న ఈ ముగ్గురు నాయకుల్లో ఒక్కరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదే దేశాన్ని యూనిట్‌గా తీసుకున్నట్లయితే రాష్ట్రానికి చెందిన నాయకులకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Feb 21, 2023, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.