ETV Bharat / state

ఎన్నో ఏళ్ల తర్వాత దక్కిన విజయం - ఆ నియోజకవర్గాల్లో గెలుపు కాంగ్రెస్​కు చాలా స్పెషల్ - Congress to form government in Telangana

Congress Wins Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో హస్తం జెండా రెపరెపలాడింది. మార్పు కావాలంటూ చేసిన ఉద్ధృత ప్రచారం ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చింది. ఎట్టకేలకు తెలంగాణ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. ఈ క్రమంలోనే దశాబ్దాల తరబడి చేయి గుర్తు మాట వినిపించని నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ పాగా వేసింది. మరి ఆ నియోజకవర్గాలేంటో చూద్దామా..?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 10:12 AM IST

Congress Wins Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో (Telangana Congress) జోష్ నింపాయి. ఓ వైపు అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. మరోవైపు పలు నియోజకవర్గాల్లో హస్తం పార్టీ సుదీర్ఘ కాలం తరువాత జెండా ఎగరేసింది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకుని తెలంగాణ ఆవిర్భావం తర్వాతా, చేజిక్కని నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అందుకుంది. దశాబ్దాల తరబడి చేయి గుర్తు మాట వినిపించని చోట పాగా వేయడంతో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి.

నర్సంపేటలో 56 సంవత్సరాలకు : నర్సంపేట నియోజకవర్గం 56 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. చివరగా 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డి సీపీఎం అభ్యర్థి ఎ.వెంకటేశ్వరరావుపై గెలిచారు.

DK Sivakumar meet Revanth, Telangana assembly election Results 2023 : రేవంత్ రెడ్డితో డీకే శివకుమార్ సంబురాలు

పాలకుర్తిలో 40 సంవత్సరాలకు : పాలకుర్తి నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఇదే తొలి విజయం. చివరగా ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు పాత చెన్నూరు పరిధిలో(రద్దయిన) ఉండగా 1983లో హస్తం పార్టీ విజయం సాధించింది. 2009 నుంచి గెలుస్తూ వస్తున్న ఎర్రబెల్లి దయాకరరావుపై ఇప్పుడు యశస్వినిరెడ్డి (Yashaswini Reddy) గెలుపొందారు.

భువనగిరిలో 40 సంవత్సరాలకు : భువనగిరి కోటపై నలభై సంవత్సరాల తర్వాత హస్తం పార్టీ జెండా రెపరెపలాడింది. హ్యాట్రిక్‌ ప్రయత్నంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిపై కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) గెలుపొందారు. ఇక్కడ చివరగా 1983లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె.నర్సింహారెడ్డి విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్‌లో 34 సంవత్సరాలకు : నాగర్‌కర్నూల్‌ను 34 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ చేజిక్కించుకుంది. హ్యాట్రిక్‌కు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి విజయం సాధించారు. చివరగా ఇక్కడ 1989లో కాంగ్రెస్‌ తరఫున వంగా మోహన్‌గౌడ్‌ గెలుపొందారు.

రామగుండంలో 34 సంవత్సరాలకు : రామగుండం నియోజకవర్గాన్ని 34 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై గెలుపొందారు. మేడారం నియోజకవర్గం(2009లో రద్దు)గా ఉన్న సమయంలో 1989లో కాంగ్రెస్‌ నుంచి మాతంగి నర్సయ్య గెలిచారు.

ఖానాపూర్‌లో 30 సంవత్సరాలకు : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధి ఖానాపూర్‌(ఎస్టీ) ఎట్టకేలకు కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జు తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ స్నేహితుడైన జాన్సన్‌ నాయక్‌పై 4,976 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్రను తిరగరాశారు.

Nizamabad Telangana Election Result 2023 LIVE : ఇందూరులో హోరాహోరీ పోరు - కాంగ్రెస్ 4, బీజేపీ 3 స్థానాల్లో గెలుపు

వేములవాడలో 25 సంవత్సరాలకు : 25 సంవత్సరాల క్రితం మెట్‌పల్లి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1998 ఉపఎన్నికలో కొమ్మిరెడ్డి జ్యోతి గెలిచారు. వేములవాడ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఇప్పుడు హస్తం పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ గెలుపొందారు.

వరంగల్‌ పశ్చిమ పాతికేళ్లకు : వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో 25 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ పాగా వేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌పై గెలుపొందారు. చివరిసారి 1998 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగారావు ఇక్కడ విజయం సాధించారు.

Telangana Assembly Election Results 2023 Live : 33 జిల్లాల్లో సత్తా చాటిన హస్తం అభ్యర్థులు వీళ్లే- ఈ వివరాలు మీకోసం

చొప్పదండిలో 24 సంవత్సరాలకు : చొప్పదండి నియోజకవర్గాన్ని 24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌పై గెలుపొందారు. చివరిగా 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సత్యనారాయణ గౌడ్‌ గెలిచారు.

ధర్మపురిలో 24 సంవత్సరాలకు : ధర్మపురిలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎ.లక్ష్మణ్‌కుమార్ (Adluri Laxman Kumar) బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై గెలుపొందారు. నాలుగు ఎన్నికల అనంతరం లక్ష్మణ్‌కు విజయం దక్కింది. ధర్మపురి ఇందుర్తిగా ఉన్నప్పుడు 1999లో హస్తం పార్టీ అభ్యర్థి బొమ్మా వెంకటేశ్వర్‌ గెలిచారు. 2009లో ధర్మపురి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది.

తెలంగాణలో నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్ - సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం!

కాంగ్రెస్​ పార్టీకి జోష్​ తీసుకొచ్చి - అన్నీ తానై వన్​ మ్యాన్​ ఆర్మీ షో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.