ETV Bharat / state

టీ కాంగ్రెస్​లో సంక్షోభం.. రంగంలోకి దిగ్విజయ్​.. దిగొచ్చిన సీనియర్లు - మహేశ్వర్​రెడ్డి ఇంట్లో కాంగ్రెస్​ నేతలు భేటీ

T Congress Seniors Meeting Cancelled: రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి అధిష్ఠానం జోక్యంతో తాత్కాలికంగా తెరపడింది. సాయంత్రం జరగాల్సిన సీనియర్ల సమావేశం వాయిదా పడింది. సమస్య పరిష్కారానికి ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న దిగ్విజయ్‌సింగ్‌ను పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించటంతో ఇప్పటికైతే సీనియర్లు దిగొచ్చారు. దిగ్విజయ్‌ స్పందనను స్వాగతిస్తున్నట్లు అసంతృప్తివర్గంలోకి ఒకరైన మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Digvijay Singh solves T congress issue
Digvijay Singh solves T congress issue
author img

By

Published : Dec 20, 2022, 1:11 PM IST

Updated : Dec 20, 2022, 2:20 PM IST

T Congress Seniors Meeting Cancelled: రాష్ట్ర కాంగ్రెస్‌లో జంబో కమిటీల ప్రకటనతో మొదలైన అసంతృప్తి.. పార్టీని పీసీసీ, సీఎల్పీ వర్గాలుగా చీల్చిన పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్ఠానం చక్కదిద్దే చర్యలు చేపట్టింది. వలసవాదులకు పదవులు దక్కాయని.. జెండా మోసిన వాళ్లకి అన్యాయం జరిగిందని అసంతృప్తుల వర్గం ఆరోపిస్తూ రచ్చకెక్కిన నేపథ్యంలో.... తాజా పరిణామాలను అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో తొలి నుంచి ట్రబుల్‌ షూటర్‌గా పేరుండటమే కాకుండా... తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్రంతో అనుబంధం ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర వ్యవహారాలపై స్పందించిన దిగ్విజయ్‌సింగ్.... సీనియర్లలో అసంతృప్తిని చల్లార్చేప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలోనే అసమ్మతి నేతలకు నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు.

అసంతృప్తివర్గంలో ఒకరైన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి దిగ్విజయ్‌సింగ్‌ ఫోన్‌చేశారు. తాజా పరిణామాలను తెలుసుకున్న ఆయన.... సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా సాయంత్రం జరపాలని నిర్ణయించిన సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని దిగ్విజయ్‌ ఫోన్‌లో సూచించినట్లు మహేశ్వరెడ్డి తెలిపారు. దిగ్విజయ్‌ స్పందనను స్వాగతిస్తున్నట్లు.... త్వరలోనే ఆయన హైదరాబాద్‌ వస్తామని చెప్పినట్లు వివరించారు. కాంగ్రెస్‌ అధిష్టానం సమస్యలు పరిష్కరిస్తుందని నమ్ముతున్నట్లు మహేశ్వరెడ్డి తెలిపారు.

అధిష్ఠానం సూచన మేరకు పలువురు నేతలు అసంతృప్తి వర్గంతో భేటీ అవుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ నాయకుడు కోదండరెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం జరగాల్సిన భేటీని వాయిదా వేస్తున్నట్లు మహేశ్వరెడ్డి వెల్లడించారు.

Mallikharjuna Kharge called Bhatti Vikramarka: మరో వైపు కాంగ్రెస్​ సీనియర్​ నేత భట్టి విక్రమార్కకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్​లో సంభాషించారు. పార్టీలోని సమస్యలను జఠిలం చేయ్యేద్దని భట్టికి పిలుపునిచ్చారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే దిగ్విజయ్​సింగ్​తో చర్చించాలని ఖర్గే సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.