congress care about loksabha elections
కుంతియా ఛైర్మన్‌గా , కన్వీనర్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సభ్యులుగా భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వి హనుమంతురాలతో పాటు మరో 37 మందితో పార్టీ కో ఆర్టినేషన్ కమిటీని నియమించారు. ప్రచార కమిటీకి సారధిగా విజయశాంతి, కో ఛైర్‌పర్సన్‌గా డీకే అరుణలతో పాటు మరో 20 మందిని ప్రకటించారు.
మీడియా సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా మధుయాస్కీ, కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌లు నియమితులయ్యారు. పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, అజారుద్దీన్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, సహా 24 మందితో కూడిన ఎన్నికల కమిటీని ఏర్పాటుచేశారు. ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.