దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్.. పార్టీ నాయకులకు స్పష్టం చేశారు.
ఇందిరా భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రతిపక్షాల పట్ల నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్నాయని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర గవర్నర్ కూడా కాంగ్రెస్ నేతలను కలవకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుందన్నారు. కరోనా పేరు చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రం కలిసేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. దీనిని బట్టి తెరాస, భాజపా ఒకటేనని అనిపిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన కాంగ్రెస్ నేతలు పోరాటం చేయాలని సూచించారు.
ఇవీచూడండి: ప్రతి ఒక్కరూ ఓ అభ్యర్థిలా పనిచేసినప్పుడే గెలుపు: మాణిక్కం