రైతులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ... కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు నిరాహార దీక్ష చేపట్టారు. ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం విఫమైందన్న ఆయన... వలస కూలీలకు క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పినా... ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన