కాంగ్రెస్ కార్యాలయాలను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. హైదరాబాద్ గాంధీ భవన్‌తోపాటు ఇందిరాభవన్, జిల్లాల్లోని కాంగ్రెస్ కార్యాలయాలను కూడా కరోనా రోగులకు చికిత్సాలయాలుగా మార్చాలన్నారు. ఇందువల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణమే కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడుతుండగా… రోజురోజుకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్ కొరతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఏర్పడిందని అయినా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీకి ప్రజల్లో మంచి పేరు రావాలంటే... కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.