ETV Bharat / state

మతం ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారు : వీహెచ్ - వీహెచ్

గ్రేటర్​ ఎన్నికల్లో మతం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్​ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్​లో ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, తెరాస ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

Congress senior leader VH comments on trs,bjp, mim in ghmc elections
మతం ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారు : వీహెచ్
author img

By

Published : Nov 25, 2020, 7:11 PM IST

ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు తెరాస, భాజపా ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. గ్రేటర్​ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మతం ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

నగరంలో ఎక్కడా చూసినా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. ఎంఐఎం నాయకులు ముస్లింలకు ఏం చేశారో చెప్పాలన్నారు. మహరాష్ట్ర, బిహార్​కు వెళ్లి ఎవరికి లాభం చేశారో అసదుద్దీన్​ ఆలోచించుకోవాలన్నారు. తాము చేసిన తప్పిదం వల్లనే దుబ్బాకలో భాజపా గెలిచిందన్నారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బండి సంజయ్ చూస్తున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ ముమ్మర ప్రచారం.. నేటి నుంచి రంగంలోకి సీనియర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.