ETV Bharat / state

ఇతర విషయాలను పక్కనపెట్టి కొవిడ్​ కట్టడిపై దృష్టి పెట్టడి: వీహెచ్​ - తెలంగాణ వార్తలు

కొవిడ్​ కట్టడిలో రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు విమర్శించారు. తెలంగాణలో ఈటల, ఏపీలో రఘురామ వ్యవహారాలపై కాకుండా వైరస్​ కట్టడిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Telangana news
తెలంగాణ తాజా వార్తలు
author img

By

Published : May 17, 2021, 6:05 PM IST

దేశంలో తయారైన వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్లే మన దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంత రావు ఆరోపించారు. కొవిడ్​ కట్టడిలో కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యాయని విమర్శించారు. అంబర్​పేటలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాలు, ఫంక్షన్​ హాల్స్​ అన్నింటినీ కొవిడ్​ చికిత్స కోసం ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వాలకు... ఎన్నికలు, ఈటల, రఘురాం మీద ఉన్న శ్రద్ధ కొవిడ్​ కట్టడిపై లేదని విమర్శించారు. వ్యాక్సిన్లను తరలించి మోదీ తప్పు చేశారని... దేశంలో కొరతకు ఆయనే కారణమని వీచ్​ ఆరోపించారు.

ఇదీ చూడండి: మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.