ETV Bharat / state

'హస్తానికి ఓటేస్తే.. హస్తవాసి మారుస్తాం' - ఓటర్లకు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ సరికొత్త పంథా

పుర ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి ఆకర్షణీయమైన తాయిలాలను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అవినీతి రహిత, అత్యుత్తమ ప్రజా సేవా కేంద్రాలుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. 24 హామీలతో కూడిన 2020 విజన్‌ డాక్యుమెంట్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వెల్లడించారు.

Congress release vision 2020 document
కాంగ్రెస్ విజన్ 2020
author img

By

Published : Jan 16, 2020, 8:50 PM IST

సమగ్రమైన రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పల్లెలు, పట్టణాలు సమతుల్యంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్న కాంగ్రెస్‌ ఆ దిశగా మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. 2020 విజన్‌ డాక్యుమెంట్‌ పేరుతో 24 హామీలతో ఓటర్లను ఆకట్టుకోడానికి ఆకర్షణీయమైన తాయిలాలను ప్రకటించింది. పట్టణాలల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేసింది.

తెల్లరేషన్ కార్డుదారులందరికీ...

తెల్లరేషన్ కార్డుదారులందరికీ.. ఉచిత నల్ల కనెక్షన్‌, మంచి నీటి సరఫరా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత రహదారుల నిర్మాణం, భూగర్భ మురికి నీటి వ్యవస్థ ఏర్పాటు, ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలు, ఇంకుడు గుంతల నిర్మాణంలాంటివి చేపడతామని పీసీసీ వివరించింది.

కాంగ్రెస్ విజన్- 2020

పార్కులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం, యువతి యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల తోడ్పాటుతో మధ్యాహ్నం, రాత్రి రెండు పూటల రూ. 5కే భోజన పథకం అమలు, కూరగాయల విక్రయకేంద్రాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది.

కాంగ్రెస్ విజన్- 2020

క్రీడామైదానాలు, జిమ్​లు..

మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం, పరిసరాల పారిశుద్ధ్యంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక వసతులతో కూడిన ఇండోర్‌ స్టేడియం, విశాలమైన క్రీడామైదానాలు, జిమ్‌లు, రీడింగ్‌ రూమ్‌లు, ఇంటర్నెట్‌ సౌకర్యంతో కూడిన గ్రంథాలయాలు, ఉచిత వైఫై కూడళ్లు ఏర్పాటు చేస్తామని వివరించింది.

కాంగ్రెస్ విజన్- 2020

6 లక్షల ఆర్థిక సాయం..

నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ, ఉపాధి కల్పనా శిబిరాల నిర్వహణ, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని పేర్కొంది. ప్రతి మున్సిపాలిటీలో జూనియర్‌, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు, ఆధునిక వసతులతో 100 పడకల ఆసుపత్రి, 108, 104 సర్వీసులను విస్తరించడం, ప్రతి వార్డులో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, రెండు ఉచిత అంబులెన్స్‌ల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ విజన్- 2020

రేపు డీసీసీ అధ్యక్షుల సమావేశాలు..

తెరాస, భాజపా తీరును ఎండగడుతూ 2020 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి డాక్యుమెంట్​ వివరాలను వెల్లడించాలని పీసీసీ ఆదేశించింది.

కాంగ్రెస్ విజన్- 2020

ఇవీ చూడండి: 'తెరాస పథకాలను కాంగ్రెస్​ కాపీ కొడుతోంది'

TG_Hyd_36_16_CONG_2020_VISION_DOCUMENT_PKG_3038066 From : Tirupal reddy Dry గమనిక: TG_Hyd_24_16_TPCC_Uttam_On_Election_AB_3038066, TG_Hyd_25_16_Dasoju_On_Municipal_Vision_AB_3038066 ఫైల్స్‌లోని బైట్లను ఇక్కడ వాడుకోగలరు. () తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి ఆకర్షనీయమైన తాయిలాలను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే అవినీతి రహిత, అత్యుత్తమ ప్రజా సేవా కేంద్రాలుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. 500 చదరపు అడుగులలోపు వైశాల్యం కలిగిన ప్రతి ఇంటికి మున్సిపల్‌ పన్ను రద్దుతోపాటు, అక్రమ కట్టడాలను క్రమబద్దీకరణ చేసుకునే వెసులబాటు కల్పిస్తామంటూ 24 హామీలతో కూడిన 2020 విజన్‌ డాక్యుమెంట్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వెల్లడించారు. LOOK వాయిస్ఓవర్‌1: సమగ్రమైన రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పల్లెలు, పట్టణాలు సమతుల్యంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఆ దిశలో మున్సిపల్‌ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించింది. 2020 విజన్‌ డాక్యుమెంట్‌ పేరుతో 24 హామీలతో ఓటర్లను ఆకట్టుకోడానికి ఆకర్షనీయమైన తైలాలను వెల్లడించింది. పట్టణాలల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తెల్లరేషన్ కార్డుదారులందరికి ఉచిత నల్ల కనెక్షన్‌, మంచి నీటి సరఫరా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత రహదారుల నిర్మాణం, భూగర్భ మురికినీటి వ్యవస్థ ఏర్పాటు, ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలు, ఇంకుడు గుంతల నిర్మానం లాంటివి చేపడతామని పీసీసీ వివరించింది. పార్కులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్లు నిర్మాణం, యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల తోడ్పాటుతో మధ్యాహ్నం, రాత్రి రెండు పూటల 5 రూపాయల భోజనం పథకం అమలు, కూరగాయల విక్రయకేంద్రాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. మూతశాలలు, మరుగుడొడ్లు నిర్మాణం, పరిసరాల పారిశుద్యంతోపాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక వసతులతో కూడిన ఇన్‌డోర్‌ స్టేడియం, విశాలమైన క్రీడామైదానాలు, జిమ్‌లు, రీడింగ్‌ రూమ్‌లు, ఇంటర్నెట్‌ సౌకర్యంతో కూడిన గ్రంథాలయాలు, ఉచిత వైఫై కూడళ్లు ఏర్పాటు చేస్తామని వివరించింది. వాయిస్ఓవర్‌2: ప్రతి మున్సిపాలిటీలో శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు పూర్తి స్థాయిలో సీసీటీవీలు ఏర్పాటు, అన్ని మతాల వారి అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన శ్మశాన వాటికల నిర్మాణం, రజకులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ధోభీ ఘాట్లు, నాయి బ్రాహ్మణులకు, కుమ్మరి సంఘానికి వారి వృత్తులు కొనసాగించుకోడానికి భూమి కేటాయిస్తామని తెలిపింది. వివాహాలు, సాంస్కృతిక ఇతరత్ర వేడకలకు సకల సౌకర్యాలతో కూడిన కన్వెన్షన్ కేంద్రాలు నిర్మాణం, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, వ్యవసాయ ఆధారిత పురపాలక సంఘాలల్లో ఎన్‌ఆర్‌ఈజీఎ పథకం అమలు, నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ, ఉపాది కల్పనా శిభిరాల నిర్వహణ, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి వంద గజాల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షలు ఆర్థిక సహాయం అందచేస్తామని పేర్కొంది. ప్రతి మున్సిపాలిటీలో జూనియర్‌, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు, ఆదునిక వసతులతో వంద పడకల ఆస్పత్రి, 108, 104 సర్వీసులను విస్తరించడం, ప్రతి వార్డులో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, రెండు ఉచిత అంబులెన్స్‌ల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. వాయిస్ఓవర్‌3: తెరాస, బీజేపీ పార్టీల తీరును ఎండగట్టుతూ 2020 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు మధ్యాహ్నం అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి డాక్యుమెంటు వివరాలను వెల్లడించాలని పీసీసీ ఆదేశించింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.