పురపాలక ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి సిద్ధమవుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఆరోపించారు. వార్డుల విభజన విషయంలో జరిగే అవకతవకలకు సంబంధించి హైకోర్టు తాజాగా చేసిన కామెంట్లను గమనిస్తే కేసీఆర్ సర్కారు చర్యలు తెలుస్తాయన్నారు. వార్డుల విభజనను కంటి తుడుపు చర్యగా హైకోర్టు ప్రస్తావించిందంటే.. ఇక ఎన్నికల నిర్వహణలో ఎన్ని అవకతవకలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విధంగా ప్రతిపక్షాలను ఓడించాలనుకోవడం సరికాదన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎస్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి అడిగితే.. అది ప్రతిపక్షాల కుట్రగా మార్చారని మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు జరిపే విచారణలో మరిన్ని నిజాలు వెలుగోలోకి వచ్చి... తెరాస బండారం బయటపడటం ఖాయమని జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం తప్పక తెరాసపై పడుతుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: కేసీఆర్.. మీకెలాంటి శిక్ష వేయాలి: పొన్నాల