ETV Bharat / state

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో బలహీన వర్గాలకు అన్యాయం'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ.. ఈ నెల 16న కాంగ్రెస్​ ధర్నా నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పట్ల సుప్రీం తీర్పును కాంగ్రెస్​ నేతలు తప్పుబట్టారు. భాజపా ప్రభుత్వ చేసే కుట్ర పూరిత చర్యలను కాంగ్రెస్ సమర్థంగా తిప్పికొడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Congress
ఉత్తమ్​, భట్టి
author img

By

Published : Feb 12, 2020, 8:23 PM IST

బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తున్నట్లు తెలిపారు. కోర్టులో కేంద్రం నియమించిన న్యాయవాదులు వినిపించిన వాదనలను ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాలను అణిచివేస్తున్నాయని ఆరోపించారు.

భాజపా ప్రభుత్వం చేసే కుట్ర పూరిత చర్యలను కాంగ్రెస్ సమర్థంగా తిప్పికొడుతుందన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... బలహీన వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న ధర్నా చౌక్​ వద్ద కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు వీహెచ్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ... ప్రభుత్వమే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

ఉత్తమ్​, భట్టి

ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.