ETV Bharat / state

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక! - లోక్​సభ ఎన్నికలు 2024

Congress preparations for Lok Sabha Polls 2024 : పార్లమెంట్‌ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. జనవరి 4న దిల్లీలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక భేటీకి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. నియోజకవర్గ బాధ్యులుగా వ్యవహరిస్తున్న మంత్రులు, సీఎల్పీ సీనియర్‌ నేతలు సమీక్షించి తాజా పరిస్థితిపై అధిష్ఠానానికి నివేదించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది.

Lok Sabha Polls 2024
Congress preparations for Lok Sabha Polls 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 6:45 AM IST

పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు - క్లీన్​స్వీప్​ సాధించడమే లక్ష్యం

Congress preparations for Lok Sabha Polls 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునేలా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా రాజకీయ పరిస్థితిని తెలుసుకుంటున్న హస్తం(Congress) పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్‌ నియోజక వర్గాలవారీగా మంత్రులు, సీనియర్‌ నేతలని ఇంఛార్జీలుగా నియమించగా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతూ పార్టీ బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఇతర పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం ఎంతనే వివరాలు సేకరిస్తున్నారు. ఎలా ముందుకెళ్తే పార్టీకి ఓటింగ్‌ శాతం పెరుగుతుందన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు.

Lok Sabha Polls 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకతతో ముందుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. పదేళ్లలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూర్చాయో జనంలోకి తీసుకెళ్లెగలిగితే బలోపేతం కావడం ఖాయమని అంచనా వేస్తోంది.

నియోజకవర్గాల వారీగా ఆసక్తి చూపుతున్న వారి జాబితాతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్‌(Lok Sabha Polls) నుంచి పోటీ చేసేందుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చిన నాయకుల పేర్లతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజక వర్గం నుంచి కనీసం నలుగురైదుగురు పేర్లు జాబితాలో ఉండేలా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటు దాడి ఘటనపై విచారణ చేయాలని కోరితే సస్పెండ్ చేస్తారా : భట్టి విక్రమార్క

Congress Plan for Lok Sabha Elections : తాజా రాజకీయ పరిస్థితిని అంచనా వేసి క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులు ఎవరో సర్వేల ద్వారా తేల్చాలని యోచిస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ సీనియర్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు వస్తే చేర్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి ఏడాదిపాటు ఏ పదవి ఇవ్వరాదని ఏఐసీసీ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్ల ఓటమి పాలైన వారితో పోటీ చేయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా మంత్రులు, సీనియర్‌ నేతలు వారికి కేటాయించిన పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి ఒక్కరే హాజరవుతారా? : జనవరి 4న దిల్లీలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరై తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు. కానీ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీనేత ఇద్దరూ రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అయినందున ఆయన ఒక్కరే హాజరవుతారా లేక ఉప ముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క హాజరవుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై వివరించేందుకు రేవంత్‌రెడ్డి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో రాహుల్‌ గాంధీ చేపట్టనున్న న్యాయయాత్రపై చర్చించనున్నట్లు సమాచారం.

'అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన'- ''ఇండియా' ఐక్యతతో బీజేపీ కనుమరుగు'

2024 ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ- మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్​గా చిదంబరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.