Congress Prajapalana Telangana 2023 : డిసెంబర్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజా పాలనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు చేయలేదని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
"ఆరు గ్యారెంటీలపై ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి కొంత సమయం పడుతుంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. డేటా సేకరించిన తర్వాత మాట్లాడుతాం. గైడ్లైన్ రూపొందిస్తాం" - శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
'అక్రమ మైనింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు' - మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
Komatireddy Venkatareddy Comments On BRS Svedapatram : అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా ఉండేలా చేయడమే తమ లక్ష్యమని నల్గొండలోని ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దులగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కేటీఆర్ శ్వేదపత్రం విడుదల చేశారని త్వరలోనే వారు చేసిన దోపిడిపై దోపిడి పత్రం విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
"గత ప్రభుత్వం అవలంభించిన పాలన ప్రజలకు నచ్చలేదు. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కోరుకున్నారు. మాపై నమ్మకం ఉంచి ప్రజలు మాకు ఇచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటాం. ఒకప క్క అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు జోడెద్దుల్లా తీసుకెళ్లి తెలంగాణను అగ్రగామిగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం." - తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి
కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి సమావేశం - ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చ
Review Of Ministers With Collectors : వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులు సీతక్క, కొండా సురేఖలు జిల్లా కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలోనూ అవసరమైన మేర అధికారులు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణలో అధికారులది కీలక పాత్ర అని దానిని సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు.
"మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. మేము శ్వేత పత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసింది. అది స్వేదపత్రం కాదు. ప్రజలందరిని కష్ట పెట్టిన స్వార్థపత్రం, అవినీతి పత్రం. బీఆర్ఎస్ నేతలు అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు." - సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ప్రజాపాలన సక్రమంగా నిర్వహించేలా చర్యలు : ప్రజా పాలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ముందే ప్రజలకు చేరేలా చూడాలని తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు.
'ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయండి'
తెలంగాణలో అధికారంలోకి వస్తాం - ప్రజాపాలన అందిస్తాం : భట్టి విక్రమార్క