హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నాయకులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై వారితో చర్చించారు. ఈ మేరకు గాంధీ భవన్లో నగర కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
హస్తం బలోపేతం దిశగా చర్చ సాగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తోందని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు కృషి చేయాలని ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అండగా నిలుస్తూ నగరవాసుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి బోసు రాజు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పండ్ల చెట్ల నరికివేతతో వానరాల అగచాట్లు.. ఆహారం కోసం తిప్పలు!