ETV Bharat / state

Congress PAC Meeting in Telangana : గాంధీభవన్​లో పీఏసీ సమావేశం.. ప్రచార ప్రణాళికపై ప్రత్యేక దృష్టి - కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్

Congress PAC Meeting in Telangana : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణలో జోరు పెంచాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గాంధీ భవన్​లో మంగళవారం సాయంత్రం జరపనుంది. ఈ భేటీలో పార్టీ ప్రచార ప్రణాళిక ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress Bus Yatra 2023
Congress PAC Meeting in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 4:49 PM IST

Congress PAC Meeting in Telangana : ఎన్నికల తేదీల ప్రకటన వెలువడటంతో కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన పావులు కదుపుతూ.. ముందుకు సాగుతుంది. దీనిలో భాగంగానే మంగళవారం సాయంత్రం గాంధీ భవన్​లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరపనుంది. పీఏసీ(Political Action Committee) సమావేశంలో పార్టీ ప్రచార ప్రణాళికలు చేయనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర కమిటీ సభ్యులు పాల్గొంటారు.

Telangana Congress Bus Yatra 2023 : ఈ నెల 15 వ తేదీ నుంచి మొదలవనున్న బస్సు యాత్ర.. విధివిధానాలు , పార్టీ అగ్రనాయకుల పర్యటన, తాజా రాజకీయాలపై చర్చ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లనుంది. నాయకుల ఐక్యత చాటేందుకు ఈ బస్సు యాత్ర దోహదం చేస్తుందని పీసీసీ భావిస్తోంది. 15వ తేదీన అలంపూర్ నుంచి బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించి.. ప్రచారాన్ని మొదలు పెడతారు.

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. రానున్న 50 రోజులు ఇక సమరమే

రెండు రోజులు బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. భారత్ జోడో యాత్ర.. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర , భట్టి పాదయాత్రలు కవర్ కానీ ప్రాంతాలకు బస్సు యాత్రలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన రైతు, యువ, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్లు, చేయూత పెన్షన్ పథకం , ఆరు గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ ప్రజలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపకల్పన చేయనుంది. ఈ నెల 18, 19 తేదీలలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంలో పార్టీ మేనిఫెస్టోను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించాలని పీసీసీ భావిస్తోంది. ఈ నెల 20, 21 తేదీలలో బస్సు యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఆయనతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బస్సుయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ సాయంత్రం జరగనున్న పీఏసీలో బస్సు యాత్ర తాజా రాజకీయ పరిణామాలు, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Congress Guarantee on old pension scheme : ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం(ఓపీఎస్) అమలు చేస్తామన్న హామీని మేనిఫెస్టోలో చేర్చాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి చాలా రోజుల నుంచి వినతులు వస్తున్న విషయం తెలిసిందే. ఛైర్మన్ శ్రీధర్​బాబు అధ్యక్షతన సోమవారం గాంధీభవన్​లో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. జీహెచ్ఎంసీ సహా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చే పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించింది.

Implementation of Election Code in Telangana : రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలు.. పోలీసుల తనిఖీలు షురూ

Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌.. బలమైన అభ్యర్థుల కోసం వేట..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.