రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్య కాదని... ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులెవ్వరూ ఆందోళన చెందవద్దని.. ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః వంటావార్పు.. సహ పంక్తి భోజనాలతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన