యురేనియం తవ్వకాలకు చెందిన వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో స్వయంగా చర్చిస్తానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 'కేటీఆర్ గారూ సురభి నాటకాలు కట్టిపెట్టండి. యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు చేయండి' అంటూ ట్వీట్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై కొన్ని రోజులుగా ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడతానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు అంశంపై అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆవేదనను తాను వింటున్నానని ట్వీట్ చేశారు. దీనిపై రేవంత్ యురేనియం తవ్వకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
-
కెటిఆర్ గారు ,”సురభి” నాటకాలు కట్టిపెట్టండి.యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి. @KTRTRS
— Revanth Reddy (@revanth_anumula) September 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">కెటిఆర్ గారు ,”సురభి” నాటకాలు కట్టిపెట్టండి.యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి. @KTRTRS
— Revanth Reddy (@revanth_anumula) September 13, 2019కెటిఆర్ గారు ,”సురభి” నాటకాలు కట్టిపెట్టండి.యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి. @KTRTRS
— Revanth Reddy (@revanth_anumula) September 13, 2019
ఇదీ చూడండి : నల్లమల యురేనియం తవ్వకాలపై నాన్నతో మాట్లాడతా...!