ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్ల పాలనలో అభివృద్ధికి బదులు ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసి....గ్రామాలు అభివృద్ది చెందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ చావుల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. ఎకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడం కారణంగానే అప్పులు చేసి గ్రామాభివృద్ధి చేసి....అప్పులు బాధ తట్టుకోలేక కాశగూడెం సర్పంచ్ షేక్ అజారుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.
ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైన, విద్యావంతుడైన యువ సర్పంచ్ బతికేవాడని పేర్కొన్నారు. అజారుద్దీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?