ETV Bharat / state

Congress MP Komatireddy Venkat Reddy Fires on KCR : 'రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా' - కోమటిరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు

Congress MP Komatireddy Venkat Reddy Fires on KCR : రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా మారిందనీ.. ఎక్కడ చూసినా కనీసం 12 గంటలు కూడా సరిగా ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 24 గంటలు కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రభుత్వానికి సవాలు విసిరారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసమ్మతి చెలరేగిందని.. ఎన్ని కొత్త స్కీమ్​లు పెట్టినా ఫలించవని కోమటిరెడ్డి అన్నారు.

Komatireddy on BRS Government
Congress MP Komatireddy Venkat Reddy Press Meet
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 4:40 PM IST

Congress MP Komatireddy Venkat Reddy Fires on KCR : రాష్ట్రంలో 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా సైతం పోటీ చేయనంటూ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని బీఆర్ఎస్(BRS) నేతలకు తెలుసని.. అందుకే దీనిపై రాష్ట్ర మంత్రులకు సైతం భయం పట్టుకుందంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రమంతటా కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పది నుంచి పన్నెండు గంటల వరకు విద్యుత్ ఎక్కడా ఉండటం లేదు. రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి ఉన్నా లేనట్లే.. ఆయనకు సబ్జెక్టు లేదు. దానిపై అవగాహన లేదు. రాష్ట్ర సమస్యలపై కేటీఆర్, హరీశ్​రావు ఎందుకు సమీక్ష చేయడం లేదు. చాలా వరకు వరి పంట కోతకు వచ్చే సమయంలో.. కరెంట్ లేక నీరు రాక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. :-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

MP Komatireddy Counter to KCR : '50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?'

Komatireddy on BRS Government : నీళ్లు, నిధులు, నియామకాలు.. అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ వాగ్ధానాలనే గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పనలో తీవ్ర విఫలం చెందిందన్నారు. గ్రూప్ పరీక్షలను నిర్వహించడంలో టీఎస్​పీఎస్​సీ పూర్తి వైఫల్యం చెందిందనీ.. పరీక్ష నిర్వహణ చేత కావడం లేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Election) తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.

5 ఎకరాల భూమి రాసుకొని.. రూ. 10 కోట్ల డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారంటూ తమ పార్టీపై హరీశ్​రావు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఒక మంత్రిగా ప్రజా సమస్యలపై పట్టించుకోవాలి కానీ ఇలా తమ పార్టీపై దూషణలకు దిగడం సరికాదు. ప్రతి రోజు ఉదయం లేచింది మొదలు, మా పార్టీని లక్ష్యంగా పెట్టుకొని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోండి. :-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

Komatireddy Venkat Reddy on Congress MLA Tickets : నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇటీవల తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో తమ అగ్రనేతలు ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తామన్నారు. అమలు చేయకపోతే ప్రభుత్వం నుంచి వెళ్లిపోతామని కోమటిరెడ్డి ప్రకటించారు. అంతేకానీ కేసీఆర్ మాదిరిగా దుబారా ఖర్చులు చేయమని వివరించారు. సీఎం కేసీఆర్(CM KCR) ఇంకా కొత్తగా ఎన్ని స్కీమ్​లు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని.. దళితుల భూములు లాక్కున్న ఘనత కేసీఆర్​దే అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే.. బొందల రాష్ట్ర సమితిగా ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Congress MP Komatireddy Venkat Reddy Fires on KCR రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Telangana Congress Flash Survey : చిక్కంతా డబుల్‌ నేమ్‌లతోనే.. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.