ETV Bharat / state

MLC Jeevan Reddy on paddy: రైతుల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా?: జీవన్‌రెడ్డి

పండించిన పంటకు కనీస మద్దతు ధర లేన్నందునే... రాష్ట్రంలో రైతులకు సమస్యలు వచ్చాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి(MLC Jeevan Reddy on paddy) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అపాయింట్​మెంట్​ తీసుకోకుండా సీఎం కేసీఆర్​ దిల్లీ వెళ్లినప్పుడే ఆయన నిజస్వరూపం బయటపడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రైతులకు ​అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్​ నుంచి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Jeevan Reddy press meet
ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు
author img

By

Published : Nov 26, 2021, 2:04 PM IST

MLC Jeevan Reddy on paddy: ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైసు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం చెబితే రైతుల పరిస్థితి ఏంటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నెలల తరబడిగా కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తుంటే... పరిస్థితిపై సమీక్షించే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో (paddy grains issue in telangana) 'రా' రైస్‌ కొనేందుకు రూ. 5వేల కోట్లు ఖర్చవుతుందని... రైతుల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఆ మాత్రం భరించలేదా అని మండిపడ్డారు.

రైతుల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా?: జీవన్‌రెడ్డి

రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలి

రోడ్లపై రైతులు పడిగాపులు కాస్తుంటే మంత్రులు ఎక్కడ ఉన్నారు.? రైతులకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వాలి. ఏ పంటను పండించాలో వారికే వదిలిపెట్టాలి. ఎక్కడైనా నేల స్వభావానికి అనుగుణంగానే పంటలు వేస్తారు. రైసు మిల్లర్లను ఎందుకు అదుపుచేయలేకపోతున్నారు.? రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా.? ఇంతవరకూ ఒక్క మంత్రి కూడా కల్లాలను సందర్శించలేదు. ప్రధాని అపాయింట్​మెంట్​ కోరకుండా కేసీఆర్ దిల్లీకి ఎందుకు వెళ్లారు.? కేసీఆర్​ దిల్లీకి వెళ్లింది.. కేంద్రం మెడలు వంచడానికా.. వంచుకొని రావడానికా.? ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎప్పుడూ రాజకీయం మాత్రమే కావాలి. -జీవన్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ

కేసీఆర్​ చెబితేనే చేస్తున్నారు

కల్లాలను సందర్శించకుండా సంబంధిత మంత్రులు నిరంజన్​ రెడ్డి, గంగుల కమలాకర్​ ఏం చేస్తున్నారని జీవన్​ రెడ్డి(mlc jeevan reddy fired on kcr) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెప్తే తప్ప కలెక్టర్లు ఏం చేయడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా రైతులకు కాంగ్రెస్​.. అండగా నిలుస్తోందని జీవన్​ రెడ్డి అన్నారు. రైతులకు కేంద్రం సహకారం ఇవ్వకపోతే దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Congress Leaders Pressmeet: వరి తప్ప మరో పంట పండని భూములను ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.